‘నమస్తే! హలో ఇండియా’ అంటూ వెల్కమ్ చెప్పిన రోబో.. వీడియో ఇదిగో!
- జపాన్ కు రావాలంటూ భారతీయులకు ఆహ్వానం
- హిరోషిమాలో జరుగుతున్న జీ 7 సదస్సులో రోబోల ఏర్పాటు
- అతిథులను ఆకట్టుకుంటున్న జపనీస్ రోబోలు
చేయి ఊపుతూ ‘నమస్తే! హలో ఇండియా’ అంటూ అతిథులకు రోబో వెల్కమ్ చెప్పింది. ఇండియన్లకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అంటూ ఓ యువతి ప్రశ్నించగా.. జపాన్ కు రావాలంటూ భారతీయులను ఆహ్వానిస్తానని చెప్పింది. జపాన్ సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడానికి తప్పకుండా తమ దేశానికి రావాలని పిలుపునిచ్చింది.