అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై కేంద్రానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
- అమరావతిలో ఏపీ సర్కారు ఇళ్ల స్థలాల పంపిణీ
- ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న రఘురామ
- ఏపీ ప్రభుత్వానికి నిధులు నిలిపివేయాలని విజ్ఞప్తి
- టిడ్కో ఇళ్లను పంపిణీ చేసేలా జగన్ ను ఆదేశించాలంటూ లేఖ
ఏపీ సీఎం జగన్ కు అమరావతి అంటే ద్వేషభావం ఉందని, రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని ఆయన పలు వేదికలపై ప్రకటించారని రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సాయపడవద్దని రఘురామ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేలా సీఎం జగన్ ను ఆదేశించాలని కోరారు.