మీడియాపై అవినాశ్ రెడ్డి అనుచరుల దాడి.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
- ఈ రోజు సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందులకు బయల్దేరిన అవినాశ్ రెడ్డి
- ఆయన కాన్వాయ్ ని వెంబడించిన మీడియా ప్రతినిధులు
- రెండు చానళ్ల ప్రతినిధులపై అవినాశ్ అనుచరుల దాడి
- మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్న తమిళిసై
- దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య
ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.