వాషింగ్టన్ డీసీలో మంత్రి కేటీఆర్ రౌండ్ టేబుల్
- ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విషయంలో అక్కడి వ్యాపారవేత్తలు, ప్రతినిధులతో చర్చ
- తెలంగాణలో అవకాశాలను వివరించిన కేటీఆర్
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన మంత్రి
స్వీయ-ధ్రువీకరణల ఆధారంగా నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ లో, పారదర్శక అనుమతులను మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది ఎలా సహాయపడిందో వివరించారు. 2018, 2020, 2022లో వరుసగా మూడు సంవత్సరాల్లో ఏరోస్పేస్‌లో భారత్ లో ఉత్తమ రాష్ట్ర అవార్డులను గెలుచుకోవడం ద్వారా తెలంగాణ ఒక అద్భుతమైన ఘనత సాధించిందని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాస్ట్ ఎఫెక్టివ్‌లో ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ లో హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘనతలు ఏరోస్పేస్ రంగం పట్ల రాష్ట్ర ప్రగతిశీల దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ వారిని కోరారు.