పేమెంట్స్ బిజినెస్‌లోకి జొమాటో.. సొంతంగా యూపీఐ సర్వీసు ఏర్పాటు
- ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి పేమెంట్స్ సర్వీస్ ప్రారంభించిన జొమాటో
- ఇకపై తమ యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం
- జొమాటో యాప్ ద్వారానే యూపీఐ సర్వీసులు
అందులో యాక్టివ్ జొమాటో యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకొని నచ్చిన జొమాటో యూపీఐ ఐడీని సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మొబైల్ నెంబర్‌ను ఇచ్చి బ్యాంక్ అకౌంట్‌ను జత చేసిన తర్వాత జొమాటో యూపీఐ జనరేట్ అవుతుంది. దాని ద్వారా జొమాటో యాప్‌తోనే పేమెంట్స్ చేసుకోవచ్చని ఫుడ్ డెలివరీ సంస్థ తెలిపింది. దాంతో, ఇకపై తమ యాప్ లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్‌లకు రీడైరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదని, నేరుగా యూపీఐ చెల్లింపులు జరపవచ్చని వెల్లడించింది.