పట్టపగలు బయటకు రావద్దు: ఐఎండీ హెచ్చరిక
- అత్యవసర పనులు ఉంటేనే రావలంటూ సూచన
- తెలంగాణ, ఏపీలోని చాలా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల నమోదు
వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వడగాల్పులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. అత్యధికంగా రాజమండ్రి ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రత్యేకంగా ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. దీంతో అత్యవసర పనులు ఉంటే తప్పించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడమే మంచిదని వాతావరణ శాఖ సూచించింది.