Vijay Antony: 'బిచ్చగాడు 2' కలెక్షన్లు కుమ్మేయడం ఖాయం: అడివి శేష్

Bichagadu 2 Pre Release Event
షార్ట్స్‌లో చూడండి
విజయ్ ఆంటోని హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'బిచ్చగాడు' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఆయన నుంచి రావడానికి 'బిచ్చగాడు 2' రెడీ అవుతోంది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. 

ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్ .. ఆకాశ్ పూరి వచ్చారు. అడివి శేష్ మాట్లాడుతూ .. "సాధారణంగా నేను కథలను రాసుకోగలను.. పెద్ద పుడింగిని అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ విజయ్ ఆంటోని గారిని చూసిన తరువాత నేను నేర్చుకోవలసింది ఎంత ఉంది అనే విషయం నాకు అర్థమైంది" అన్నారు. 

విజయ్ ఆంటోని గారికి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి పట్టు ఉంది. అలాగే ఎడిటింగ్ .. డైరెక్షన్ .. మ్యూజిక్ డైరెక్షన్ గురించి ఆయనకి బాగా తెలుసు. అలాంటి ఆయన నాకు కాల్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మని అడిగితే రాకుండా ఎలా ఉంటాను? ఆయన ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశారనే విషయం అర్థమవుతూనే ఉంది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పాడు. ఇక విజయ్ ఆంటోని మాట్లాడుతూ, 'బిచ్చగాడు' చూసినవారిని 'బిచ్చగాడు 2' ఎంతమాత్రం నిరాశపరచదని అన్నారు. 
Go Back to Shorts
Vijay Antony
Kavya Thapar
Bichagadu 2

More Telugu News