200 కోట్ల వసూళ్ల దిశగా 'ది కేరళ స్టోరీ'
- ఈ నెల 5వ తేదీన విడుదలైన 'ది కేరళ స్టోరీ'
- నిన్న ఒక్క రోజులోనే 10 కోట్లు రాబట్టిన సినిమా
- 11 రోజుల్లో 147 కోట్ల వసూళ్లు
- 200 కోట్ల మార్కును తేలికగా అందుకుంటుందనే టాక్
ఒక వైపున ఈ సినిమాకి విమర్శలు .. వివాదాలు ఎదురవుతూ ఉంటే, మరో వైపున వసూళ్లు పెరుగుతూ వెళ్లడం విశేషం. నిన్న ఒక్క రోజులోనే ఈ సినిమా 10 కోట్లను వసూలు చేసింది. దాంతో 11 రోజుల్లో ఈ సినిమా 147 కోట్లను రాబట్టినట్టు అయింది. 200 కోట్ల మార్కును ఈ సినిమా అందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదా శర్మ .. సిద్ధి ఇద్నాని .. యోగిత ... సోనియా ... దేవదర్శిని ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వెళుతున్న నేపథ్యంలో, లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించవచ్చని అంటున్నారు. మరి ఈ వసూళ్ల వరద ఎక్కడ ఆగుతుందనేది చూడాలి.