నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు: డీకే శివకుమార్
- ఇతరుల సంఖ్యాబలం గురించి తనకు సంబంధం లేదని వ్యాఖ్య
- సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారని ఆవేదన
- క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే
కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. డీకే కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేసులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉండటంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.