పెద్దమనసును చాటుకుంటున్న చరణ్ ఫ్యాన్స్!

Ramcharan Fans
  • 'గ్లోబల్ స్టార్' గా ఎదిగిన చరణ్
  • 'ఆర్ ఆర్ ఆర్' తరువాత పెరిగిన అభిమానుల సంఖ్య
  • సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులు
  • వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు బటర్ మిల్క్ ప్యాకెట్ల పంపిణీ 
దేశ వ్యాప్తంగా చరణ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో .. ఆస్కార్ వేదికపై ఆ సినిమాకి లభించిన గుర్తింపుతో .. 'గ్లోబల్ స్టార్'గా లభించిన ఆదరణతో చరణ్ స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇక చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటూ, తన కెరియర్ గ్రాఫ్ ను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నాడు. తమ అభిమాన హీరో సాధిస్తూ వెళుతున్న విజయాల పట్ల, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరణ్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. వేసవి కావడంతో కొన్ని రోజులుగా అన్ని ప్రాంతాలలోను ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరొకొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగానున్నట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై .. షోలాపూర్ .. భీంవండి .. అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ అక్కడి ప్రజలకు  బటర్ మిల్క్ ప్యాకెట్స్ ను భారీస్థాయిలో పంచిపెట్టారు. చరణ్ కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

Advertisement
Ramcharan
Actor
Tollywood

More Telugu News