తిరుమల వెంకన్నను దర్శించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
- స్వామి దర్శనానికి తూఫాన్ వాహనంలో బయలుదేరిన తాడిపత్రి, బళ్లారికి చెందిన 14 మంది బంధువులు
- తిరుగు ప్రయాణంలో వైఎస్సార్ జిల్లా ఏటూరు సమీపంలో ప్రమాదం
- అదుపు తప్పి తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
- తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు
మార్గమధ్యంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో వైఎస్సార్ జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.