‘నందిని’ స్వీట్లతో కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేతల సంబరాలు.. బీజేపీపై సెటైర్లు!
- అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్
- ప్రచారంలో కీలక అంశంగా నందిని, అమూల్ డెయిరీలు
- నందిని బ్రాండ్ ను దెబ్బతీసేందుకు అమూల్ తెచ్చారంటూ కాంగ్రెస్ విమర్శలు
ఎన్నికలకు ముందు, గుజరాత్ రాష్ట్ర మిల్క్ కోఆపరేటివ్ బ్రాండ్ అయిన అమూల్ బెంగళూరులో తాజా పాలు, పెరుగును ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో విమర్శలు ఎదురయ్యాయి. ఇది ప్రచారాంశంగా కూడా మారింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ 'నందిని' ని దెబ్బకొడుతున్నారని కాంగ్రెస నేతలు ఆరోపించారు. బీజేపీ మద్దతుతో అమూల్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బ్రాండ్ 'నందిని'కి ముప్పు కలుగుతుందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపించాయి. నందిని బ్రాండ్ కన్నడిగుల గుర్తింపు అని, అమూల్‌తో దాన్ని దెబ్బకొడుతున్నారని ఆరోపించారు.