కర్ణాటక సీఎం ఎవరని ప్రశ్నిస్తే డీకే శివకుమార్ సమాధానం ఇదీ!
- కర్ణాటక సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పని చేసిన చోట ప్రతిఫలం ఉంటుందని వ్యాఖ్య
- శక్తే తనని ఎన్నికల్లో నడిపించిందని కామెంట్
- సీఎం ఎవరనేదానిపై అంతటి ఆసక్తి అవసరం లేదన్న డీకే
కర్ణాటక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. కొత్త సీఎంను ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది. నేడు సాయంత్రం 6.00 గంటలకు జరగనున్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరు సీఎం అవుతారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అయితే, సిద్దరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయనతో పాటూ పలువురు కీలక నేతలను డిప్యూటీ సీఎంగా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యల్లో ఆధ్యాత్మికత ధోరణి కనిపించడం ఆసక్తికరంగా మారింది.