పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పాకిస్థానీ తాలిబన్లు
- ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కార్యకర్తలతో నిరసనల్లో పాల్గొనేందుకు తాలిబన్ల నిర్ణయం
- పీటీఐకి అండగా నిలవాలంటూ తాలిబన్ కమాండర్ ఆదేశాలు
- పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు సాధిస్తున్న విజయాలపై తాలిబన్ కమాండర్ హర్షం
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత పాకిస్థాన్ హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుదారులు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఈ నిరసనల సెగ ఏకంగా కోర్ కమాండర్ అధికారిక నివాసాన్ని తాకింది. అంతేకాకుండా.. పాకిస్థాన్ ఆర్మీ జనరల్ కార్యాలయాన్ని కూడా వారు కొంత సేపు అష్టదిగ్బంధనం చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ బెయిల్పై విడుదలయిన తరువాత పాకిస్థాన్లో హింసాత్మక నిరసలకు తెరపడింది. అన్ని కేసుల్లో ఆయనకు కోర్టు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేసింది. మే 15 వరకూ ఎటువంటి అరెస్టులు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.