నేడే పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం.. ఢిల్లీకి సెలబ్రిటీల క్యూ!
- ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో సాయంత్రం జరగనున్న వేడుక
- లండన్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా
- హాజరుకానున్న పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు
పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం. కాగా, కొంతకాలంగా ప్రేమలో ఉన్న పరిణీతి, రాఘవ్ ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్ కు వచ్చి మీడియా కంటపడ్డారు. కానీ, తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని వాళ్లు ధ్రువీకరించలేదు. పరిణీతి - రాఘవ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారని, వారు చాలా కాలం నుంచే స్నేహితులు అని తెలుస్తోంది.