జియో సినిమా యూజర్లకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్
- ప్రీమియం చందా ప్లాన్ రూ.999 విడుదల
- దీని ద్వారా మరింత కంటెంట్ చూసుకునే అవకాశం
- ఏక కాలంలో నలుగురితో షేర్ చేసుకోవచ్చు
ఏడాదికి రూ.999 ప్లాన్ లో భాగంగా ఏ డివైజ్ నుంచి అయినా జియో సినిమాను చూసుకోవచ్చు. అధిక వీడియో నాణ్యతతో వీక్షించొచ్చని సంస్థ తెలిపింది. ఏక కాలంలో నాలుగు డివైజ్ లపై ఒకే లాగిన్ తో ఇది పనిచేస్తుంది. రూ.999 ప్లాన్ ను ఒకరు తీసుకుని, దాన్ని మరో ముగ్గురికి షేర్ చేసుకోవడం ద్వారా ఒకేసారి నలుగురు వాడుకోవచ్చు. దీనివల్ల కొంత ఆదా అవుతుంది. జియో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లో హెచ్ బీవో వీడియోస్ ను కూడా చూసుకోవచ్చు.