Samantha: ఆ నాలుగు సినిమాల నష్టాల్లో 'ఏజెంట్' వాటానే ఎక్కువట!

  • ఏప్రిల్ నెలలో వచ్చిన మూడు భారీ సినిమాలు
  • తొలి రోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న 'రావణాసుర'  
  • 'శాకుంతలం' విషయంలో వెలవెలబోయిన థియేటర్లు 
  • ఎక్కువ నష్టాలు తెచ్చుకున్న 'ఏజెంట్' 
  • మరోసారి నిరాశపరిచిన గోపీచంద్  
Agent Movie Update

సాధారణంగా వేసవి సెలవుల్లో ఎక్కువ సినిమాలు థియేటర్లు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాలలో చాలా వరకూ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. ఒకవేళ ఫ్లాప్ అయినా మరీ కుంగిపోయేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే వేసవి సెలవుల్లో థియేటర్ల దగ్గర సందడి కాస్త గట్టిగానే కనిపిస్తూ ఉంటుంది.

కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. భారీ బడ్జెట్ తో వచ్చిన స్టార్ సినిమాలు, ఊహించని స్థాయిలో నష్టాలను చవిచూశాయి. ఏప్రిల్ 7వ తేదీన విడుదలైన రవితేజ 'రావణాసుర', తన మార్క్ కి దూరంగా ఆయన చేసిన కథ. అందువలన బడ్జెట్ తో పొంతనలేని వసూళ్లు వచ్చాయి. ఇక ఏప్రిల్ 14వ తేదీన వచ్చిన 'శాకుంతలం' కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. దిల్ రాజు - గుణశేఖర్ లకు ఈ సినిమా గట్టి జర్క్ నే ఇచ్చింది.   

ఏప్రిల్ 28వ తేదీన వచ్చిన అఖిల్ 'ఏజెంట్' సినిమా, జరిగిన బిజినెస్ తో పొంతనలేని వసూళ్లను రాబట్టింది. అఖిల్ ను విపరీతమైన ట్రోలింగ్ కి గురిచేసిన సినిమాగా నిలిచింది. ఈ నెల 5వ తేదీన వచ్చిన 'రామబాణం' కూడా పరాజయాలను సాధించిన సినిమాల జాబితాలో చేరిపోయింది. అయితే టాలీవుడ్ పరంగా చూసుకుంటే ఈ నాలుగు సినిమాల వలన వచ్చిన నష్టాల్లో, 'ఏజెంట్' వైపు నుంచి వచ్చిందే ఎక్కువని అంటున్నారు. 

More Telugu News