'వాహ్ ఉస్తాద్' అనిపించేలా పవన్ పోస్టర్.. ఫస్ట్ గ్లింప్స్‌పై మరింత ఉత్కంఠ

Pawan Kalyan poster revealed from Ustaad Bhagat Singh
  • ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ పోస్టర్ విడుదల
  • హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా
  • ఈ సాయంత్రం 4.59 గంటలకు  రానున్న ఫస్ట్ గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ 11 ఏళ్ల కిందట టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. ఇన్నేళ్ల తర్వాత ఈ ముగ్గురి కలయికలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. టైటిల్ ఖరారు చేసినప్పటి నుంచే ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ విడుదలై 11 ఏళ్లు అయిన సందర్భంగా ఈ రోజు పవన్ స్టార్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

కళ్ల జోడు పెట్టుకొని, బ్యారికేడ్ పై చేయి ఉంచిన పవన్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయింది. ఆయన వెనకాల చాలా మంది ముస్లింలు ఉన్నారు. క్లాస్, మాస్, స్వాగ్ అన్నీ కలగలిసినట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయేలా ఉంది. స్టయిల్, స్వాగ్‌తో కూడిన సేవియర్ (రక్షకుడు) అంటూ చిత్ర బృందం దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Ustaad Bhagat Singh
poster

More Telugu News