గతంలో పనిచేసిన అధికారులు కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
- ప్రభుత్వం ఆర్నెల్లు ఉంటుంది.. కానీ సోమేశ్ కుమార్ను మూడేళ్లు నియమించడమేమిటని ప్రశ్న
- ఆయన నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
- కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీ కోసం పని చేశారని ఆరోపణ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై దర్యాఫ్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పని చేశారని రేవంత్ ఆరోపించారు. హంగ్ వస్తే జేడీఎస్... బీజేపీకి మద్దతు తెలిపే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేశారన్నారు. మజ్లిస్ ఓట్లు చీలిస్తే జేడీఎస్ కు నష్టం జరుగుతుందని కేసీఆర్ భావించారని, అందుకే ఈ ఎన్నికలపై వ్యూహాత్మక మౌనం పాటించారని చెప్పారు. కర్ణాటక ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు.