Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో భారీ వర్షం, ఉక్కపోత నుండి నగరవాసులకు ఉపశమనం

Heavy rain in Hyderabad on wednesday
Advertisement
  • దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం
  • రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బంది
  • పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత
Advertisement
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా కనిపించిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, ఉప్పల్, ఘట్ కేసర్, వనస్థలిపురం, దమ్మాయిగూడ, నాగోల్, రామంతాపూర్, రామ్ నగర్, విద్యానగర్, అంబర్ పేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

ఉదయం నుండి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షం కారణంగా కాస్త ఉపశమనం లభించినట్లయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుండి వరంగల్ రోడ్డు దారిలో రోడ్డుపై నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
Advertisement
Advertisement
Hyderabad
rain

More Telugu News