Game Changer: చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి తాజా కబురు చెప్పిన శంకర్

Game Changer electrifying climax Wrapped up
షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి విదితమే. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఓ పాత్రలో పవర్ ఫుల్ ఆఫీసర్ అని సమాచారం. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్ తాజా అప్ డేట్ ఇచ్చారు. 

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అద్భుతమైన క్లైమాక్స్ చిత్రీకరణ నిన్న పూర్తయిందని చెబుతూ రాత్రిపూట షూటింగ్‌ స్పాట్ లో తీసిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ రోజు నుంచి కమలహాసన్ హీరోగా వస్తున్న ‘ఇండియన్2’ షూటింగ్ పై పూర్తి ఫోకస్ పెడతానని ట్వీట్ చేశారు. శంకర్ చేతిలో ఉన్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Go Back to Shorts
Game Changer
climax
Ramcharan
director shankar
Wrapped up

More Telugu News