Revanth Reddy: కేటీఆర్ పేరు కూడా ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నాడు: రేవంత్ రెడ్డి

Revanth Reddy comments on KTR name
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కేటీఆర్ కు... తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అసలు ఆయన పేరే ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నదని విమర్శించారు. కేటీఆర్ కు సొంతంగా పేరు కూడా లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

"ఆయనకు పేరు లేదు, సొంతంగా ఊరు లేదు... తెలంగాణలో చదువుకున్నది లేదు... తెలంగాణతో పేరు బంధం కానీ, పేగు బంధం కానీ లేదు" అని వివరించారు. 

"నీ పేరే డ్రామారావు. ఆంధ్రా నుంచి అరువు తెచ్చుకున్నాడు. చదివింది గుంటూరు విజ్ఞాన్ లో. అంటే... దీన్ని బట్టి నీకు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి పాత్ర లేదు. నీ చదువు గుంటూరులో... నీ ఉద్యోగం అమెరికాలో. సిక్స్ పాయింట్ ఫార్ములా నుంచి చూస్తే 610 జీవో వరకు కేటీఆర్ కు ఇక్కడ ఏ హోదాలోనూ సాంకేతికంగా, నైతికంగా కొనసాగే అర్హత లేదు" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
Name
Andhra
Telangana
Congress
BRS

More Telugu News