తెలంగాణలో పాగా వేద్దాం... పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాయావతి
- హైదరాబాదులో తెలంగాణ భరోసా సభ నిర్వహించిన బీఎస్పీ
- ముఖ్య అతిథిగా హాజరైన మాయావతి
- వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు నిర్దేశం
తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మాయవతి వ్యాఖ్యానించారు. బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం మాత్రమే కాదని, సకల వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటుందని, ఆ దిశగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మాయావతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.