ట్రైలర్‌తోనే చరిత్ర సృష్టించనున్న ఆదిపురుష్
- ఈ నెల 9న ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల
- భారత్ తోపాటు 70 దేశాల్లో ఒకేసారి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్
- జూన్ 16న విడుదల కానున్న చిత్రం
ప్రభాస్, కృతి లుక్స్, జై శ్రీరాం పాట సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్‌తోనే చిత్ర బృందం చరిత్ర సృష్టించనుంది. ఆదిపురుష్ ట్రైలర్ ను భారత్ లో వందకుపైగా థియేటర్లతోపాటు అమెరికా, కెనడా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్,, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూకే, రష్యా లలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోందని చిత్ర బృందం తెలిపింది. మొత్తంగా 70 దేశాల్లో నేరుగా ట్రైలర్ లాంచ్ అవ్వనున్న భారత తొలి సినిమా ఇదే కానుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.