బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే
- ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
- ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు
- ఈసారి హంగ్ వచ్చే అవకాశమే లేదన్న ఖర్గే
ఎన్నికల నేపథ్యంలో తాను సుడిగాలి పర్యటనలు చేస్తున్నానని... సాయంత్రం సభల్లో పాల్గొనడానికి 100 కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడానికే అన్ని కష్టాలను భరిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ప్రధాని మోదీ కూడా వరుస ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.