ప్యాన్ వరల్డ్ తెలుగు సినిమా ‘హనుమాన్’ వాయిదా

Multilingual Super Hero film Hanuman Postponed
  • తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌ చిత్రం
  • ఈ నెల 12న విడుదల అవుతుందని చెప్పిన చిత్ర యూనిట్
  • గ్రాఫిక్ వర్క్ ఆసల్యం కావడంతో వాయిదా పడినట్టు తాజా ప్రకటన
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న హనుమాన్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ టీజర్‌ ఇప్పటికే దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. దాంతో, చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ్, మరాఠి, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్, స్పానిష్, కొరియ, చైనీస్, జపనీస్ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు. 

కానీ గ్రాఫిక్స్ పనులు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా వెనక్కు వెళ్లింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న అంచనాలను అందుకునేందుకు చిత్ర యూనిట్ మరింత ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. హనుమాన్‌ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటి అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Hanuman
movie
Postponed
teja sjja
prashanth varma

More Telugu News