లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ లోకి వెస్టిండీస్ బిగ్ హిట్టర్
- రూ.50 లక్షలకు జాన్సన్ చార్లెస్ తో కేకేఆర్ ఒప్పందం
- లిట్టన్ దాస్ వెళ్లిపోవడంతో చోటు చేసుకున్న మార్పు
- వికెట్ కీపర్, బ్యాటర్ గా చార్లెస్ కు మంచి ట్రాక్ రికార్డ్
జాన్సన్ చార్లెస్ వికెట్ కీపర్, బ్యాటర్. వెస్టిండీస్ తరఫున 41 టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో పాల్గొన్నాడు. 971 పరుగుల స్కోర్ చేశాడు. 2012, 2016 ఐసీసీ వరల్డ్ టీ20 విజయాల్లోనూ పాలు పంచుకున్నాడు. లిట్టన్ దాస్ ఐపీఎల్ ఆరంభ మ్యాచుల్లో పాల్గొనలేదు. ఏప్రిల్ మధ్యలో జట్టులో భాగమైన అతడు, అదే నెల చివర్లో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ ఏడాది లిట్టన్ పనితీరు కూడా ఏమంత బాగోలేదు.