ఈ వారంలోనే సన్ నెక్స్ట్ లో 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి'
- మరో ప్రేమకథగా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
- నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా రూపొందిన సినిమా
- మార్చి 17న థియేటర్స్ కి వచ్చిన సినిమా
- ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ
- ఈ నెల 5వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్
మార్చి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. సంజయ్ - అనుపమ ఇద్దరూ ప్రేమించుకుంటారు. సొంత ఊరు నుంచి మొదలైన వారి ప్రేమకథ, ఫారిన్ లోను కొనసాగుతుంది. అలకలు .. బుజ్జగింపులతో కథ రోటీన్ గా నడుస్తుంది. అందువల్లనే ఈ సినిమా ఆదరణ పొందలేకపోయింది.
దర్శకుడిగా అవసరాల తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రావడానికి రెడీ అవుతోంది. సన్ నెక్స్ట్ వారు ఈ సినిమాను ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.