ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్

Delhi liquor scam is false says Kejriwal
  • ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును పొరపాటున ఛార్జ్ షీట్ లో రాసిన ఈడీ
  • ఒక వ్యక్తి పేరును పొరపాటున కూడా రాస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్న
  • నిజాయతీ గల ఆప్ ను అప్రతిష్టపాలు చేసేందుకే మోదీ ఇదంతా చేస్తున్నారని మండిపాటు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభకోణం ఒక బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఛార్జ్ షీట్ లో తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును పొరపాటున ఛార్జ్ షీటులో చేర్చినట్టు ఈడీ చెప్పడమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఒక వ్యక్తి పేరును పొరపాటున కూడా ఛార్జ్ షీట్ లో రాస్తారా? అని ఎద్దేవా చేశారు. ఈ స్కామ్ బూటకమని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు. మన దేశంలో అత్యంత నిజాయతీ గల పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే ప్రధాని మోదీ ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Arvind Kejriwal
AAP
Delhi Liquor Scam

More Telugu News