ప్రామిస్ చేస్తున్నాం.. పవన్ ఆవేశాన్ని మీరు మళ్లీ చూడబోతున్నారు..!: ‘ఓజీ’పై అప్ డేట్ ఇచ్చిన మేకర్స్
- ‘ఓజీ’ సినిమా ముంబై షెడ్యూల్ పూర్తి
- సోషల్ మీడియాలో వెల్లడించిన మేకర్స్
- శరవేగంగా షూటింగ్.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా రిలీజ్!
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు సాలిడ్ అప్ డేట్ అందించారు. ముంబై షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు పవన్ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఆవేశాన్ని మీరు మళ్లీ చూడబోతున్నారు. మేం ప్రామిస్ చేస్తున్నాం’’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.