ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం కోటా కింద ఎంతమందికి ప్రవేశం కల్పించారు?: ఏపీ హైకోర్టు
- ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లు
- 2022లో తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు
- తీర్పు సరిగా అమలు కావడంలేదంటూ న్యాయవాది యోగేశ్ పిటిషన్
- అధికారులపై హైకోర్టు ఆగ్రహం
- తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని హెచ్చరిక
ఈ ధిక్కరణ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది. 25 శాతం కోటా కింద ప్రైవేటు సంస్థల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించారో చెప్పాలని నిలదీసింది. కేటాయించిన సీట్ల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.