హైదరాబాద్ ను కుమ్మేసిన భారీ వర్షం
- నగరాన్ని మరోసారి అతలాకుతలం చేసిన వర్షం
- రోడ్లపైకి చేరిన నీరు... నిలిచిన ట్రాఫిక్
- ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు
- విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ
వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. దాంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఈ మేరకు 040 211 11111 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.