అప్పుల బాధ తట్టుకోలేక ప్రముఖ డ్యాన్సర్ ఆత్మహత్య... సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో
- నెల్లూరులో సెల్ఫీ వీడియో తీసుకొని చైతన్య ఆత్మహత్య
- అప్పు తీర్చే శక్తి ఉన్నప్పటికీ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని వీడియో
- ఢీ షో ద్వారా మంచి కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న చైతన్య
ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు... చైతన్య సారీ చెప్పాడు. అప్పులు తీర్చగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నాడు. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం.. ఇలా అప్పు మీద అప్పు తనకు ఇబ్బందిని కలిగించినట్లు చెప్పాడు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోలకు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.