తూర్పు గేటు నుంచి వెళ్లి నూతన సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్
- రిబ్బన్ కట్ చేసి సచివాలయంలో అడుగు పెట్టిన సీఎం
- ఆరో అంతస్తులో తన చాంబర్ కు వెళ్లి తొలి సంతకం
- తమ చాంబర్లలో ఆసీనులైన మంత్రులు
అదే సమయంలో మంత్రులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై సంతకాలు చేశారు. అంతకుముందు తూర్పు గేటు నుంచి సచివాలయానికి వచ్చిన సీఎంకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్యాటరీ కారులో సచివాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన నడుచుకుంటూ యాగశాలకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం నిర్వహించిన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు.