‘దేవర’ కాదు.. ‘దేవుడే దిగివచ్చినా’ పవన్–సాయితేజ్ సినిమా టైటిల్​ ఇదేనా?

Buzz about Pawan Saitej new movie Title
  • ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు
  • సాయితేజ్ తో వినోదాయశీతం రీమేక్ టైటిల్ పై ప్రచారం 
  • సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా
తన శైలికి భిన్నంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో తన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ తో మల్టీస్టారర్ ఒకటి. ఇది తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ శీతం’చిత్రానికి రీమేక్‌. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్‌ షూటింగ్ పూర్తయింది. ఓ పాట మాత్రమే మిగిలుంది. ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఇదేనంటూ సోషల్ మీడియాలో రెండు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదట వినిపించింది ‘దేవర’. తాజాగా ‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

దేవుడికీ, మనిషికీ మధ్య నడిచే కథ కావడంతో ఈ పేర్లు వినిపిస్తున్నాయి. దేవర టైటిల్ క్యాచీగా ఉండగా.. కథానుసారం దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ వైపు చిత్ర బృందం మొగ్గు చూపుతుందని అంటున్నారు. అదే ఫైనల్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కమెడియన్‌, పవన్‌ కు అభిమాని అయిన హైపర్‌ ఆది ‘దేవుడే దిగి వచ్చినా’? అంటూ పవన్‌కల్యాణ్‌, పికెఎస్‌డిటి టైటిల్‌ను ట్యాగ్‌ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. కానీ, చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ జూలై 28న విడుదల కానుంది.
Advertisement
Pawan Kalyan
Sai Dharam Tej
new movie
title

More Telugu News