Jagan: ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, వైసీపీ క్యాడర్ కు ధన్యవాదాలు: సీఎం జగన్

CM Jagan thanked people and YCP cadre
  • ఏపీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం
  • కార్యక్రమం విజయవంతమైందన్న జగన్
  • తమ పాలన పట్ల అచంచల నమ్మకం ఉంచారని వెల్లడి
  • దేవుని దయ, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్ష
రాష్ట్రంలో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం విజయవంతమైందని సీఎం జగన్ వెల్లడించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. "మన పాలన పట్ల, మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి... ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైసీపీ క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు... దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను" అని వివరించారు.
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News