Ravi Shastri: ధోనీ మరోసారి టీమిండియాలోకి... రవిశాస్త్రి ఏమన్నాడంటే...!

Ravishastri opines on if Dhoni make a comeback into Team India
  • అంతర్జాతీయ క్రికెట్ కు చాన్నాళ్ల కిందటే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ
  • జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • ధోనీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియాలోకి వస్తే అనే ప్రశ్నకు శాస్త్రి జవాబు
  • ధోనీ ఎప్పటికీ కుర్ర వికెట్ కీపర్లకు అడ్డుతగలడని స్పష్టీకరణ
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు చాన్నాళ్ల కిందటే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ మరోసారి టీమిండియాలోకి వస్తే ఎలా ఉంటుందన్న ఓ ప్రశ్నకు మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి స్పందించారు. 

జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే టీమిండియాలోకి ధోనీ పునరాగమనం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న రవిశాస్త్రికి ఎదురైంది. 

అందుకు రవిశాస్త్రి బదులిస్తూ... ధోనీ ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించేశాడని, ధోనీ నుంచి ఒక నిర్ణయం వెలువడ్డాక అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని స్పష్టం చేశాడు. 

టీమిండియాలో వికెట్ కీపర్ గా ఇప్పుడు కొత్త ఆటగాడు ఉన్నాడని, అలాంటివారిని ప్రోత్సహించడానికే ధోనీ ప్రాధాన్యత ఇస్తాడు తప్ప, వాళ్లకు అడ్డుతగలాలని ఎప్పటికీ భావించడని రవిశాస్త్రి స్పష్టం చేశారు. దేశంలోని యువ వికెట్ కీపర్లకు ధోనీనే స్ఫూర్తి అని కొనియాడారు.
Ravi Shastri
MS Dhoni
Team India
Wicket Keeper
WTC Final

More Telugu News