Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్

Pawan Kalyan met TDP Supremo Chandrababu in Hyderabad
  • హైదరాబాదులో చంద్రబాబుతో పవన్ సమావేశం
  • ఇరువురి మధ్య చర్చ
  • ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ భేటీ కావడం ఇది మూడోసారి
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై చర్చించారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నట్టు తెలిసింది. 

ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ భేటీ కావడం ఇది మూడోసారి. 2014లో టీడీపీతోనే ఉన్న జనసేన, 2019 తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో బీజేపీకి దగ్గరైంది. అయితే, ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ సమావేశమవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

పవన్ ను నాడు విశాఖలో అడ్డుకున్న అనంతరం, చంద్రబాబు  స్వయంగా విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు వెళ్లి పవన్ ను పరామర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య ఓ సమావేశం జరిగింది. ఈ క్రమంలో, నేడు చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ అయ్యారు.

Chandrababu
Pawan Kalyan
Hyderabad
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News