PBKS: వరుసగా చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్న అర్షదీప్ సింగ్

  • నాలుగు ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్
  • అంతకుముందు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చుకున్న వైనం
  • పంజాబ్‌పై 56 పరుగుల భారీ తేడాతో లక్నో విజయం
PBKS Bowler Arshdeep Singh bowls his worst ever spell in IPL

పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్‌లో వరుసగా చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్నాడు. గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగును ఉతికి ఆరేశారు. ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల అర్షదీప్ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే తీసుకుని ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు కూడా అతడి పేరున ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ నెల 5న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసుకుని 47 పరుగులు ఇచ్చుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆ రికార్డును చెరిపేసి మరో చెత్త రికార్డును తన పేర రాసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ మరో బంతి మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయింది.

More Telugu News