తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. అమరులకు నివాళి అర్పించిన కేసీఆర్
- తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు
- ప్రారంభమైన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్
- మొత్తం 279 మందికి ఆహ్వానం
కేవలం ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే తెలంగాణ భవన్ లోకి అనుమతించారు. మొత్తం 279 మందికి ఆహ్వానం అందింది. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మరోవైపు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.