హైదరాబాద్ నుంచి షిర్డీకి స్పెషల్ టూర్ ప్యాకేజీ
- తక్కువ ధరలో తీసుకొచ్చిన తెలంగాణ పర్యాటక శాఖ
- సిటీలో పలు పికప్ పాయింట్ల నుంచి బస్సులు
- బాబా దర్శనం, భోజనం ఏర్పాట్లు సొంతంగా చేసుకోవాల్సిందే!
టూర్ సాగేదిలా..
హైదరాబాద్ లోని వివిధ పికప్ పాయింట్ల నుంచి సాయంత్రం బస్సులు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షిర్డీ చేరుకుంటాయి. హోటల్ లో ప్రెష్ అప్ అయ్యాక సాయినాథుడి దర్శనం చేసుకోవాలి. సాయంత్రం 4 గంటలకు షిర్డీ నుంచి బస్సులు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
సిటీలోని పికప్ పాయింట్లు..
దిల్‌షుక్‌నగర్, బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్ బీ, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి బస్సులు సాయంత్రం షిర్డీకి బయలు దేరతాయి
మినాయింపులు..
ఈ టూర్ లో బాబా దర్శన టికెట్ సదుపాయాన్ని చేర్చలేదు. అంటే బాబా దర్శనం కోసం ముందుగానే భక్తులు టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. మధ్యహ్న భోజనం ఏర్పాట్లు కూడా భక్తులు స్వంతంగానే చూసుకోవాలి. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour ను సందర్శించాలని అధికారులు సూచించారు.