Chandrababu: చంద్రబాబు రోడ్ షో సందర్భంగా గాయపడ్డ వ్యక్తి మృతి

Man wounded during Chandrababu show dead
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్ షో సందర్భంగా గాయపడ్డ అడుసుమిల్లి వెంకటేశ్వర్లు అనే కార్యకర్త ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, అమరావతి రోడ్ షో సందర్భంగా రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వెంటనే మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో వెంకటేశ్వర్లు చిక్కుకున్నాడు. అతని శరీరం చాలా మటుకు కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు స్వస్థలం అచ్చంపేట మండలం గ్రంధశిరి గ్రామం. వెంకటేశ్వర్లు మృతితో టీడీపీ శ్రేణులు ఆవేదనలో మునిగిపోయాయి.
Go Back to Shorts
Chandrababu
Road Show
Bykes
Fire Accident

More Telugu News