Elon Musk: ట్విట్టర్ ఖాతాతో మస్క్ ప్రతి నెల ఆర్జన రూ.80 లక్షలకు పైమాటే

Elon Musk makes 80 lakhs from Twitter
షార్ట్స్‌లో చూడండి
ట్విట్టర్ యూజర్లు తమ కంటెంట్ నుండి డబ్బులు సంపాదించేందుకు అధినేత ఎలాన్ మస్క్ మానిటైజేషన్ ఆప్షన్ తీసుకు వచ్చారు. బ్లూ టిక్ కు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించారు. సుదీర్ఘ సమాచారం నుండి ఎక్కువ నిడివి గల వీడియోల ద్వారా దేనికైనా సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకొని డబ్బులు ఆర్జించవచ్చునని చెప్పారు. ఈ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ గురించి మస్క్ ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. యూజర్లు మానిటైజేషన్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా సబ్ స్క్రిప్షన్ కు వెళ్లవచ్చునని చెప్పారు.

అలా తన అకౌంట్ ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్ల సంఖ్యను రివీల్ చేశాడు. దీంతో మస్క్ ట్విట్టర్ అకౌంట్ కు 24,700 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నట్లు వెల్లడైంది. ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ ధర అమెరికాలో నెలకు 5 డాలర్లు కాగా, యాపిల్ ఇన్ యాప్ పర్చేజ్, ట్విట్టర్ రెవెన్యూ షేర్ పోను ఒక్కో సబ్ స్క్రిప్షన్ నుండి కొంత మొత్తం చొప్పున కంటెంట్ క్రియేటర్ కు చెల్లిస్తుంది ట్విట్టర్. మస్క్ కు ప్రస్తుతం నెలకు ఒక్కో సబ్ స్క్రైబర్ పైన 4 డాలర్ల చొప్పున వస్తోంది. అంటే 24,700 సబ్ స్క్రైబర్ల పైన నెలకు రూ.80 లక్షలకు పైగా వస్తున్నాయి. ఏడాదికి రూ.9 కోట్లకు పైగా వస్తుంది.
Go Back to Shorts
Elon Musk
Twitter

More Telugu News