ఆస్తులన్నీ సునీత పేరున బాబాయ్ రాశారు.. ఆస్తుల గొడవే అయితే సునీతను చంపేవాళ్లు: వైఎస్ షర్మిల
- బాబాయ్ వివేకా చాలా మంచి వ్యక్తి అన్న షర్మిల
- ఆయన గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
- మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం ఎందుకని మండిపాటు
బాబాయ్ తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పారు. అన్ని ఆస్తులూ సునీత పేరు మీదే ఉన్నాయని... ఒకటి, అర ఆస్తులను కూడా సునీత పిల్లల పేరిట వీలునామా రాశారని తెలిపారు. హత్యకు ఆస్తులు కారణం కాదని... ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే బాబాయ్ ని కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు.