కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ సుదర్శన యాగం
- ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవం
- ఉదయం 6 నుంచి సుదర్శన యాగం
- మధ్యాహ్నం 1.58–2.04 గంటల మధ్య తమ చాంబర్లలో కొలువు తీరనున్న సీఎం, మంత్రులు
మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో సుముహర్తం ఉండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరుతారు. ఈ ఆరు నిమిషాల సమయంలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని అధికారులకు, మంత్రులకు జీఏడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మరోవైపు నూతన సచివాలయంలో ఆయా శాఖలకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ చాంబర్లను కేటాయించింది. ఏ అంతస్తులో ఏ శాఖ ఉండాలో నిర్ణయించింది. ఒక్కో అంతస్తును మూడు, నాలుగు శాఖలను కేటాయించింది. ఆరో అంతస్తులో సీఎం, సీఎంఓ,సీఎస్ కార్యాలయం ఉండనుంది.