సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం: ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు
- డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల నిరసన బాట
- మలి దశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందన్న బొప్పరాజు
- ఉద్యమం తీవ్రమైతే బాధ్యత తమది కాదని స్పష్టీకరణ
- ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం
డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యంలో, ఈ నెల 28న ఏపీ ఎన్జీవోలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం అవుతున్నట్టు బొప్పరాజు వెల్లడించారు.
పీఆర్సీ, డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, పాత బకాయిలు ఎన్నేళ్లకు ఇస్తారో తెలియడంలేదని వాపోయారు.