Manjira River: మంజీరా నది గరుడగంగ కుంభమేళా ప్రారంభం

Manjira Kumbhmela started
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని మంజీరా నది గరుడగంగ కుంభమేళా ప్రారంభమయింది. మంజీరా నదిలో పుష్కరుడు ప్రవేశించడంతో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం పంచవటి క్షేత్రం ఆవరణలో గరుడగంగ కుంభమేళాను ప్రారంభించారు. పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహనంతో కుంభమేళా ప్రారంభమయింది. కాసేపట్లో అంటే ఉదయం 11 గంటల నుంచి మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడం ప్రారంభమవుతుంది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహిస్తారు. ఉత్తరాది నుంచి నాగా సాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు కూడా కుంభమేళాకు తరలిరానున్నారు.
Go Back to Shorts
Manjira River
Kumbhmela

More Telugu News