ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు
- ఇండోనేషియాలో వరుస భూకంపాలు
- ఈ తెల్లవారుజామున గంటల వ్యవధిలో రెండు ప్రకంపనలు
- 6.1, 5.8 తీవ్రత నమోదు
తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండోది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపాల కారణంగా ఎలాంటి నష్టం సంభవించినదీ తెలియరాలేదు. కాగా, గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సబాంగ్కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.