కేసీఆర్ ను చూసి దేశం నవ్వుతోంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పారిపోయాడు: బండి సంజయ్
- ఇప్పుడు పైసలు లేవని చెబుతున్నాడన్న కరీంనగర్ ఎంపీ
- కేసీఆర్ చెప్పే మాటలు అన్నీ కోతలే అని వ్యాఖ్య
- కేసీఆర్ ను చూసి నవ్వుతున్నారంటే మనం నవ్వులపాలు అవుతున్నట్లే అన్న బండి సంజయ్
బిడ్ వేస్తానని వెనక్కి పోయిన కేసీఆర్ ను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోందన్నారు. కేసీఆర్ ను చూసి నవ్వుతున్నారు అని అంటే మనం కూడా నవ్వులపాలు అవుతున్నట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఏం మాట్లాడుతాడో కేసీఆర్ కే తెలియదని, చెప్పింది ఒక్కటీ చేయడన్నారు.