వైఎస్ వివేకానందరెడ్డితో నాకు రెండు సార్లు వివాహం జరిగింది: షమీమ్
- తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్న షమీమ్
- సునీతారెడ్డి కూడా తనను బెదిరించారని వ్యాఖ్య
- హత్యకు గురి కావడానికి ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని వెల్లడి
తన కొడుకు పేరు మీద భూమి కొనాలని వివేకా అనుకున్నారని... అయితే, వివేకాను శివప్రకాష్ రెడ్డి అడ్డుకున్నారని షమీమ్ చెప్పారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని... చెక్ పవర్ కూడా లేకుండా చేశారని అన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. హత్యకు గురి కావడానికి కొన్ని గంటల ముందు కూడా వివేకా తనతో మాట్లాడారని తెలిపారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ తో మనకు రూ. 8 కోట్లు వస్తాయని చెప్పారని వెల్లడించారు. వివేకా చనిపోయారని తెలిసినప్పటికీ... శివప్రకాష్ రెడ్డిపై ఉన్న భయంతో అక్కడకు వెళ్లలేకపోయానని చెప్పారు.